రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 27, నేటిధాత్రి:
మందమర్రి ఏరియాలోని ఆర్కేపి ఓపెన్ కాస్ట్ లో మేనేజర్ గా విధులు నిర్వహించిన వెంకటేశ్వర్లు ఇందారం ఐకే1ఏ గని, ఓపెన్ కాస్ట్ మేనేజర్ గా బదిలీపై వెళ్లనున్న సందర్భంగా ఆయనను బిఆర్ఎస్ పట్టణ ఇంచార్జ్ గాండ్ల సమ్మయ్య ఘనంగా శాలువాలతో సత్కరించి మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ మేనేజర్ వెంకటేశ్వర్లు ఓపెన్ కాస్ట్ లో విధులు నిర్వహించిన సమయంలో నిబద్ధతగా పనిచేస్తూ కార్మికుల సంక్షేమ కోసం కృషి చేసేవాడని, విధులు నిర్వహించే కార్మికుల పట్ల ఎప్పటికప్పుడు సేఫ్టీ సూచనలు అందిస్తూ బొగ్గు ఉత్పత్తి సాధించే దిశగా పనిచేసేవాడని అయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ గోవిందరావు, ఓసీ రక్షణ అధికారి రామరాజు వెల్ఫేర్ ఆఫీసర్ వెల్ఫేర్ ఆఫీసర్ , కౌన్సెలర్ రేవల్లి ఓదెలు, ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.