హసన్ పర్తి నేటిధాత్రి:
తేదీ 12-06-2024 రోజున గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ వంగపహాడ్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలను పునప్రారంభం ప్రారంభించే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కే ఆర్ నాగరాజు గారు..
అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలియజేశారు. రెసిడెన్షియల్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు ఉన్నత స్థాయికి వెళుతున్నారు ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ పాఠశాలలో అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం లక్ష్యంగా మంచి విద్యను బోధించడం జరుగుతుంది. ఉచితంగా అందిస్తున్న విద్యను అభ్యసించి పై స్థాయికి వెళ్ళాలని కోరారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించి వారు కూడా భాగస్వాములు అవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సుజాత మరియు శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థినీలు మరియు కాంగ్రెస్ పార్టీ 2వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల రఘు, అనిల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మార్త రవీందర్ మాజీ సర్పంచ్ రాజేందర్ పిఎసిఎస్ చైర్మన్ మెరుగు రాజేష్. దోమ కుమార్ మంద కొమురయ్య ములకలపల్లి రాజు ఇంజపురి రాము రుద్రారం శ్రీనివాస్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.