
వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంబటి స్వామి, ప్రధాన కార్యదర్శి పవన్, ఉపాధ్యక్షులు కే రవిశంకర్ గౌడ్, హుస్సేన్, సంతోష్ యాదవ్, డి రవికుమార్, కోశాధికారి రామకృష్ణారెడ్డి, కార్యదర్శి శేఖర్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు, జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ హోలీ వేడుకలు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, ఇందిరా పార్కు, వివేకానంద చౌరస్తా, పాలిటెక్నిక్ కళాశాల ముందు గల చత్రపతి శివాజీ చౌరస్తా నుంచి పొట్టి శ్రీరాములు చౌరస్తా వరకు భారీ ర్యాలీగా వెళ్లి హోలీ పండుగ పలువురు జర్నలిస్టులు , ఆటపాటల మధ్య ఆనంద కేలీలతో అందరిని ఆకట్టుకునే విధంగా స్నేహపూర్వకంగా జర్నలిస్టులు జరుపుకోవడం పట్ల పట్టణ ప్రజలు అభినందించారు, పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట జర్నలిస్టులు బారులు తీరి ప్రదర్శన నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రజా వాగేయకారుడు కళాకారుడు కవి రాజారాం ప్రకాష్, తన ఆటపాటలతో జర్నలిస్టుల హోలీ ఉత్సవాలు పాల్గొని అందర్నీ ఆకట్టుకునే విధంగా ప్రదర్శన నిర్వహించారు, ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మిత్రులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాలనాయకులు పాల్గొన్నారు,