హెచ్ఎం నీ సస్పెండ్ చేయాలి
కుల మతం బేధాలు లేకుండా విద్యార్థుల మధ్య ఐక్యత పెంచాలి .
విద్యార్థి నీతో ఎంక్వయిరీ చేసిన విషయాల్ని బహిర్గతం చేయాలి.
గర్ల్స్ ఆశ్రమ పాఠశాలల్లో లేడీ హెచ్ఎం నే నియమించాలి.
జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీఏ పీవో గారు స్పందించాలి
టీ ఏ జి యస్, ఏ ఎస్ పి, పీ డి ఎస్ యు,, యస్ .ఫ్. ఐ డిమాండ్.*
నేటి ధాత్రి భద్రాచలం.
రామచంద్రన్నపేట ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘటనపై విద్యార్థి ,ఆదివాసి సంఘాలు స్పందిస్తూ విద్యార్థిని స్వగ్రామానికి వెళ్లి విద్యార్థిని విచారించడం జరిగింది.
విద్యార్థిని. నాగజ్యోతి చెప్పిన వివరాలు.
ఈరోజు నేను పెట్టిన వీడియో చూసి స్పందించిన ఐటీడీ అధికారులు మా ఇంటికి డిడి మేడం డి సి డి ఓ మేడం ఏ టి డి ఓ సార్ వాళ్ళు నన్ను విచారణ చేయడానికి మా ఇంటికి వచ్చినారు. నన్ను వీడియో ఎలా చేశావు ఎవరన్నా చేయించారా నువ్వే చేసావా నీకు ఏవి ఇబ్బంది ఉన్నది నిజం చెప్పు అని నన్ను అడిగారు. నేను వీడియోని తీసి పెట్టింది వాస్తమని ఎవరు బలవంతంగా తీయమని నాకు చెప్పలేదని నేను ఆ వీడియోని అందరికీ అందజేయాలని ఆలోచనతో చేశానని నన్ను కులం పేరుతో ఇబ్బంది పెడుతున్నారని నేను డిడి మేడం కి చెప్పాను అనేక సందర్భాల్లో నన్ను తిడుతున్నారని ఇవన్నీ అందరికీ తెలియాలని ఈ వీడియోని లీడ్ చేశానని మేడం వాళ్ళకి చెప్పాను మేడం వాళ్ళు పదేపదే మార్చి మార్చి అడిగింది అడుగుతూ నన్ను కనిపించడం జరిగింది అయినా సరే నేనే వీడియో తీశాను నేను ఇబ్బంది పడ్డాను కాబట్టే నేను ఈ వీడియోని బయట పెట్టాను అని చెప్పాను. హెచ్ఎం గారిపై ఏమి యాక్షన్ తీసుకుంటారో వేచి చూస్తున్నాను.
పీ డి యస్ యు రాష్ట్ర కమిటీ సభ్యులు మునిగేలా శివ ప్రశాంత్ , టీ జి ఏ యస్ జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య , ఎ యస్ పి, డివిజన్ అధ్యక్షులు మల్లు, దొర యస్ ఫ్ ఐ సండ్రా ఉపేందర్ నాయకులు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల మధ్య ఐక్యతను పెంచాలని కుల మతం భేదం లేకుండా అందరికీ ఒకే విద్యని అందించాలని విద్యార్థులకు కులాలతో కూడిన విద్యను కాకుండా నాణ్యమైన విద్యని స్వచ్ఛమైన విద్యని విద్యార్థుల మధ్య ఐక్యతను పెంచే విద్యని కులాల పేరు లేకుండా విద్యని అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు నిన్న జరిగిన ఘటనపై ఐటిఐ అధికారులు DD,ATDO అధికారులు వచ్చి విద్యార్థులని విచారణ చేశారని వివరణ అడిగితే పొంతనలేని సమాధానం చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయారని వారు అన్నారు. విద్యార్థిని ఇంటికి వెళ్లి జరిగిన ఘటనపై వివరణ తీసుకొని పూర్తిస్థాయి విచారణ చేయకుండానే వెడ్డి నుండి వెళ్లిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ నాయకులు అడిగినప్పుడు విద్యార్థిని ఒక్కొక్క సమాధానం చెబుతుందని వారంటూ హాస్టల్ కి వెళ్తున్నాము అని చెప్పి అధికారులు హాస్టల్ రాకుండా వెళ్లిపోవడం సరైన పద్ధతి కాదని నాయకులు విమర్శించారు. ఐటిడిఏ పై అధికారులు పర్యవేక్షణ లేకపోవడమే సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని సమస్య జరిగినప్పుడు తోతూ మంత్రంగా చర్యలు తీసుకొని చేతులు దులుపుకుంటున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ సమస్యలు పురాణావతం అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పై అధికారులు ఎంక్వయిరీ చేసిన విషయాలని బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. గత ఐదు రోజుల కిందట జరిగిన ఘటనపై పూర్తి సమాచారం హెచ్ఎం ఇవ్వకుండా ప్రవేట్ పంచాయతీ చేసి అగ్రిమెంట్ రాసుకొని ప్రవేట్ పంచాయతీకి హెచ్ఎమ్ కూడా వెళ్లడం దారుణమైన విషయమని వారన్నారు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ హాస్టల్లో సమస్య వచ్చినప్పుడు పై అధికారులకు తెలియజేయకుండా ఆ విషయాన్ని అక్కడే కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తూ కాలం గడుపుతున్న హెచ్ఎం పై ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకుంటారో అధికారులు స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు విద్యార్థిని సెల్ఫీ వీడియో విచారణ పూర్తి స్థాయిలో చేసి వేగవంతంగా సమస్యని పరిష్కారం చేయాలని వారు ఐటిడిఏ అధికారులని డిమాండ్ చేశారు. గర్ల్స్ ఆశ్రమ పాఠశాలలో అనేక సంవత్సరాల నుండి విద్యార్థి సంఘాలు ఆదివాసి సంఘాలు బాయ్స్ టీచర్స్ ని ఉంచకూడదని చెప్పినప్పటికీ అదే పద్ధతిలో ఐటిఐ అధికారులు కొనసాగించడం వలన ప్రతిసారి ప్రతి హాస్టల్లో సమస్యలు తలెత్తుతున్నాయని సాయంత్రం 6 దాటితే హాస్టల్లో బాయ్స్ టీచర్స్ ని ఉంచకుండా ప్రధాన బాధ్యత లల్లో నియామకాలు లేకుంటే సమస్యలు జరగకుండా ఉంటాయని వారు అన్నారు. ఇప్పటికైనా తక్షణమే ఐటీడీఏ అధికారులు స్పందించి హెచ్ఎం ని సస్పెండ్ చేయాలని, గర్ల్స్ హాస్టల్ లో గర్ల్స్ హెచ్ఎం ని నియమించాలని వారు డిమాండ్ చేశారు.
నారాయణరావుపేట కురం బుర్రయ్య గ్రామ పెద్ద వివరణ.
కులాలతో విద్యని కాకుండా అందర్నీ సమానంగా చూడాలని పిల్లల దగ్గర కులాల గురించి మాట్లాడొద్దని మరణమైన విద్య అందించి వారిని మంచి భవిష్యత్తు ఉండేలా ఎదిగేలా తయారు చేయాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో PDSU భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు దండుగుల రామ్ చరణ్, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షులు దాసరి సాయన్న, విద్యార్థిని తల్లిదండ్రులు సురేషు ,పార్వతి, గ్రామ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు.