HIV Awareness Drive in Parakala
రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి టెస్ట్ లు
గర్భిణి స్త్రీలకు హెచ్ఐవి నిర్ధారణ,తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి
పరకాల ఓఆర్‌డబ్ల్యు వీణ
పరకాల,నేటిధాత్రి
పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ నుండి నిర్మూలన దిశగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఓఆర్‌డబ్ల్యు వీణ ఆధ్వర్యంలో పట్టణంలో హెచ్ఐవి టెస్టులు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తాపీ మేస్త్రి మరియు లేబర్స్ దగ్గర హెచ్ఐవి టెస్టులు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1064 సమగ్ర కౌన్సిలింగ్ మరియు పరీక్ష కేంద్రాలు ఐసిటిసి మరియు 871 ఎఫ్ఐసిటిసి ల ఏర్పాటు రాష్ట్రవ్యాప్తంగా 11మొబైల్ ఐసిటిసి వాహనాల ద్వారా హెచ్ఐవి సోకే ప్రమాదం అధికంగా ఉన్న ప్రాంతాలలో ఉచితంగా హెచ్ఐవి పరీక్షల నిర్వహణ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది సంపూర్ణ సురక్ష కేంద్రాల ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా ద్వారా హెచ్ఐవి మరియు ఎస్టిఐ లకు సంబంధించిన ఉచిత సేవలు ఒకే చోట అందించడం మరియు హెచ్ఐవి ఎట్ రిస్క్ నెగిటివ్ క్లైంట్లను సమయాలుసారంగా ఫాలోఅప్ చేస్తూ రెండు సంవత్సరాల వరకు వారిని నెగటివ్‌గా కొనసాగించడం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ద్వారా గుర్తించబడిన ప్రైవేటు ఆసుపత్రులలో గర్భిణి స్త్రీలకు హెచ్ఐవి నిర్ధారణ మరియు తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలిపారు.
