నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
సిపిఎం పార్టీకి సత్తయ్యచేసిన సేవలు మరువలేనివని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారంమునుగోడు మండల కేంద్రంలోనిసిపిఎం పార్టీ కార్యాలయంలో బోడిశ సత్తయ్యగారి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,అమరవీరుల ఆశయాల కోసం పోరాటాలు నిర్వహించాలనివారు అన్నారు. మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో 1995 నుండిసిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిగా, మండల కమిటీ సభ్యునిగా, రైతు సంఘం మండల నాయకునిగా పేద ప్రజల కోసం ఎనలేని కృషి చేశారని వారు అన్నారు. కూలీల కోసం, పేద రైతుల కోసం గ్రామస్థాయిలో జరిగిన గ్రామసభలలో పేద ప్రజల సమస్యల పైన అధికారులను నిలదీసేవారని అన్నారు.పార్టీ నిర్మాణానికికట్టుబడి ఉండిక్రమశిక్షణతో పని చేసేవారని, నేడున్న పెట్టుబడి దారికి,దోపిడి సమాజంకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలునిర్వహించే వారిని వారు అన్నారు.ఎన్నికల సందర్భంగానిక్కార్సంగాపార్టీ నిర్ణయం కట్టుబడి,ఇతర ప్రలోభాలకు లొంగకుండాకృషి చేసేవారని వారన్నారు.ఆయన మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలోచండూరు మండల కార్యదర్శిమోగుదాల వెంకటేశం, సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, మునుగోడు మండల నాయకులువ్యాస రాణి శ్రీను,పగడాల కాంతయ్య, వేముల లింగస్వామి, యాట రాజు, నడిపల్లి రమేష్, బొడ్డుపల్లి యాదయ్య, దొండ వెంకన్న, బి నరసింహతదితరులు పాల్గొన్నారు.
సిపిఎం పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివి: సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
