
"Hindi Day Celebrations at Motlapalli High School"
ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు
మోట్లపల్లి ఉన్నత పాఠశాలలో.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ స్థాయి సమావేశము ప్రధానోపాధ్యాయులు శ్రీ కుమారస్వామి అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభను ఉపన్యాసాల రూపంలో మరియు కవితల రూపంలో నృత్య రూపంలో పాటల రూపంలో ప్రదర్శించినారు ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ హిందీ మన భారత దేశ రాజభాషగా 1949 వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన భారత రాజ్యాంగంలో గౌరవించడం జరిగినదని హిందీ మన భారత దేశ సంస్కృతిలో భాగమని మన భారతదేశంలో హిందీ మాట్లాడేవారు తెలిసినవారు అత్యధికమైన వారు ఉన్నారని స్వాతంత్ర సంగ్రామంలో దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఈ భాష ఎంతగానో తోడ్పడిందని మహాత్మా గాంధీ గారు దేశమంతా తిరుగుతూ స్వతంత్ర అవసరాన్ని ప్రజలందరికీ తెలియజేయడంలో హిందీ భాషలోనే ప్రజల్ని పోరాటంలో పాల్గొనేలా హిందీ నే అధిక ప్రాధాన్యత పొందిందని తెలియజేశారు
అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భూపాలపల్లి జిల్లా హిందీ ఫోరం అధ్యక్షులు శ్రీ నోముల రవీందర్ గారు మాట్లాడుతూ హిందీ మన రాష్ట్రంలో ద్వితీయ భాషగా అమలులో ఉన్నదని హిందీని నేర్చుకోవడం ద్వారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా రాణించవచ్చునని హిందీ ద్వారా వివిధ రకాల విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా బ్యాంకుల్లో రైల్వేలో విమానయాన సంస్థల్లో ఆర్మీలో నేవీలో మరియు సమాచార రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు