పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి
జైపూర్,నేటి ధాత్రి:
పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి
తెలంగాణలోని వాహనదారులకు భారీ షాక్ తగలనుంది.2019కి ముందు కొన్న వెహికిల్స్ అయితే వాటికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ ప్లేట్‌లను సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా బిగించుకోవాలని సూచించింది.లేకుంటే ఆ వాహనాలను అమ్మడానికైనా, కొనడానికైనా వాహనంపై ఉన్న ఇన్సూరెన్స్,పొల్యూషన్ వర్తించవని వెల్లడించింది.ఒకవేళ అలాంటి వాహనాలు రోడ్డుపై తిరిగితే వాటిని పట్టుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది.