
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1999వ సంవత్సరంలో కలిసి పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు గత 20 సంవత్సరాల నుండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు అనారోగ్యంతో చనిపోయిన కుటుంబ సభ్యులకు తమ చిన్ననాటి స్నేహానికి గుర్తుగాఆర్థికంగా సహాయం చేస్తూ వస్తున్నారు. తమతో కలిసి చదువుకున్న స్నేహితులు చనిపోవడం బాధాకరమైనప్పటికీ వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సహాయం చేయడం తమ బాధ్యతగా తీసుకుంటామని కామర మల్లేష్ తెలియజేశారు. శనివారం రోజున చిన్ననాటి స్నేహితుడు దక్షిణామూర్తి చనిపోవడంతో తమ సొంత గ్రామం కొత్తూరు కి వెళ్లి వారి కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో అరిగిన శ్రీనివాస్ గౌడ్ సహారా రమేష్ వెంకట స్వామి తిరుపతి తులసీరామ్ వేణు తిరుపతి ఇతర స్నేహితులు పాల్గొన్నారు.