రామడుగు, నేటిధాత్రి:
ప్రవాస భారతీయుల స్వచ్ఛంద సేవా సంస్థ “హోప్ ఫర్ స్పందన” ఉపాద్యక్షులు లక్ష్మీ నరసింహం సారథ్యంలో సుష్మ దీప్తి ఆర్థిక సహకారంతో లక్షా ముపై వేల రూపాయల వ్యయంతో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో దివ్యాంగుడైన పాతగంటి చంద్రశేఖర్ కి స్వయం ఉపాధిలో భాగంగా కిరాణా షాపుని పెట్టించడం జరిగింది. ఈషాపుని రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షులు, సంస్థ ప్రతినిధి గజ్జల అశోక్ చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. ఈసందర్భంగా గజ్జెల అశోక్ మాట్లాడుతూ దివ్యాంగుల కుటుంబాలకు ఉపాది కల్పించడం ద్వారా వారు స్వయం కృషితో ఎదగడానికి అవకాశం కల్పించిన వారం అవుతామని, అలాగే కుటుంబానికి కూడ అండగా వుంటారని భావించి వీరికి సాయం అందించడం జరిగిందని, సంస్థ ఉపాధ్యక్షులు లక్ష్మీ నరసింహం కోట ఆలోచనని మేము రెండు తెలుగు రాష్ట్రాలలో కార్యరూపంలో వుంచడానికి మావంతుగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈకార్యక్రమంలో సంస్థ సభ్యులు నవీన్ కుమార్, అనిల్ కుమార్, మహేష్, ప్రణయ్, రాజ్ కుమార్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.