ప్రమాదంలో గాయపడిన ఎస్టిపిపి కాంట్రాక్టు కార్మికుడికి చేయూత
ఈడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో 66 వేల చెక్కు అందజేత
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టిపిపి అధికారులు, ఉద్యోగులు గత జనవరి నెల 31 న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎస్టిపిపి కాంట్రాక్టు కార్మికుడు మరియు క్రికెట్ ఆటగాడు అయిన గడ్డం శివ సాయి కి వైద్య ఖర్చుల నిమిత్తం 66 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
శివ సాయి ఒక కాంట్రాక్టు కార్మికుడుగా మాత్రమే కాదు మంచి క్రికెట్ ఆటగాడిగా ఎస్టిపిపిలో గుర్తింపు గల వ్యక్తి అతడికి ఈ విధంగా ప్రమాదం జరిగిందని తెలియగానే క్రికెట్ చీఫ్ కోఆర్డినేటర్ పంతులా(డిజిఎం) కోఆర్డినేటర్లు పి. వి. బ్రహ్మం (డిజిఎం)మరియు పులి సురేష్ (సేఫ్టీ ఆఫీసర్ )చొరవ తీసుకోని క్రీడాకారులు మరియు ఉద్యోగులు నుండి ఈ మొత్తాన్ని సేకరించడం జరిగింది.
ఎస్టిపిపి లోని పరిపాలనా భవనంలో జరిగిన కార్యక్రమంలో ఎస్టీపిపి ఇన్చార్జ్ ఈడి కే.శ్రీనివాసులు చేతుల మీదుగా 66,000/- వేల రూపాయల చెక్కుని కాంట్రాక్ట్ కార్మికుడు శివ సాయి కి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఈడి కే.శ్రీనివాసులు మాట్లాడుతూ ఏ వ్యక్తి జీవితంలోనైనా ప్రమాదం అనేది ఆ వ్యక్తికి మరియు ఆ కుటుంబానికి చాలా బాధాకలిగించే విషయమని అన్నారు.
మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తల వల్ల రాబోయే ప్రమాదాన్ని అరికట్టవచ్చని తెలిపారు.ప్రతి ఒక్క ఉద్యోగి తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.
అలాగే ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మరియు కారు నడిపెటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.
ఉద్యోగులు సహాయం చేయడంలో ఎస్టిపిపి ఉద్యోగులు ముందుంటారని, విరాళాల ద్వారా తగు ఆర్థిక సహాయం అందించి బాధితులకి మనోధైర్యాన్ని కల్పిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ కోఆర్డినేటర్ డి. పంతులా(డిజిఎం), ఏ ఐ టి యు సి పిట్ సెక్రటరీ సత్యనారాయణ, ఏజిఎం (సివిల్)కె.ఎస్.ఎన్. ప్రసాద్, ఏజిఎం (ఫైనాన్స్)మురళీధర్,డీజీఎం(పర్సనల్)అజ్మీరా తుకారాం, డీజీఎం పి. వి. బ్రహ్మం,పులి సురేష్ (సేఫ్టీ ఆఫీసర్ )ఇతర అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.