వరంగల్ కాశిబుగ్గ అంబేద్కర్ విగ్రహం వద్ద చలో ఈదుముడి కరపత్రాలు ఆవిష్కరణ
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
గ్రేటర్ వరంగల్ జిల్లా కేంద్రంలో కాశిబుగ్గ అంబేద్కర్ విగ్రహం వద్ద, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్), మాదిగ రాజకీయ పోరాట సమితి (ఎంపిఎస్), మహాజన పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బి ఎన్ రమేష్ కుమార్ మాదిగ ఆదేశాల మేరకు, వరంగల్ జిల్లా అధ్యక్షులు గుర్రపు శ్యామ్ మాదిగ ఆధ్వర్యంలో, ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొక్కల వెంకటస్వామి మాదిగ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, హలో మాదిగ చలో ఈదుముడి కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. అనంతరం వరంగల్ జిల్లా మీడియా కన్వీనర్ దాసారపు సారన్న మాదిగ మాట్లాడుతూ ఎస్సీ ఏబిసిడి రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై జూలై 7న మాదిగల పుణ్యక్షేత్రం ప్రకాశం జిల్లా మండలం నాగులుప్పుల పాడు గ్రామం, ఈదుమూడిలో జరగబోయే మాదిగల మహా జాతరను విజయవంతం చేయాలని, ఎమ్మార్పీఎస్ స్థాపించి 30 సంవత్సరాల సందర్భంగా జరగబోయే మీటింగ్ కి అందరు హాజరు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్దల కుమార్, రాష్ట్ర మీడియా కన్వీనర్ జేరిపోతుల విల్సన్ మాదిగ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి టి సంపత్ మాదిగ, హనుమకొండ జిల్లా అధికార ప్రతినిధి మామునూరు భాస్కర్ మాదిగ, వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి తక్కలపల్లి రాజు మాదిగ, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ మాదిగ, యువజన నాయకులు ఐత అశోక్, వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షులు పసునూరి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.