Heavy Rains Alert Till 25th
25 వరకు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు
ఈనెల 25వతేదీ వరకు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఱ తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయి. ఈ పరిస్థితుల్లో, నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో శుక్రవారం నుంచి ఈ నెల 25వ తేది వరకు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆ ప్రకారం కడలూరు, నాగపట్టణం, తిరువారూరు. మైలాడుదురై, రామనాధపురం(Ramanathapuram), విరుదునగర్, తెన్కాశి, కన్నియాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి తదితర జిల్లాల్లో శుక్రవారం భారీవర్షాలు కురిసే అవకాశముంది. అలాగే, కడలూరు, మైలాడుదురై, నాగపట్టణం, తిరువారూరు, తంజావూరు, పుదుకోట, శివగంగ, రామనాథపురం, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో ఈ నెల 22,23 తేదీల్లో భారీవర్షాలు కురిసే అవకాశముంది.
