రైతులను ముంచిన భారీ వర్షాలు
◆:- పూర్తిగా దెబ్బతిన్న పత్తి పంట
◆:- ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలి:
◆:- బిఆర్ఎస్ నాయకులు ఈదులపల్లి మహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రజలు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమ త్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల ఈదులపల్లి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ అన్నారు. ఎడతెరిపి లేకుంట కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు బయటికి రావొద్దని, ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటి ప్రాణాలను రిస్క్ లో పెట్టొద్దని అన్నారు. సాధ్యమైనంత వరకు వాగుల ప్రవాహం ఆగిన తర్వాతనే దాటాలని కోరారు. అదేవిదంగా నిలకడ లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మండలంలోని పంటలు అన్ని పూర్తిగా పాడయ్యాయని, రైతులు చాలా నష్ట పోయారని, కౌలు రైతుల పరిస్థితి ఇంకా దారుణమని అన్నారు. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు అందించాలని, కౌలు రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.