
Heavy Rains Destroy Crops; Farmers Demand Compensation
రైతులను ముంచిన భారీ వర్షాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
పూర్తిగా దెబ్బతిన్న పత్తి పంటప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలి:మలా మహానడు ఝరాసగం మండలు అధ్యక్షులు బాబు సంగారెడ్డి జిల్లా ఝరసంగం మండల ప్రజలు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని గంగాపూర్ మలా మహానాడు సీనియర్ నాయకులు బాబు అన్నారు.ఎడతెరిపి లేకుంట కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు బయటికి రావొద్దని, ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటి ప్రాణాలను రిస్క్ లో పెట్టొద్దని అన్నారు. సాధ్యమైనంత వరకు వాగుల ప్రవాహం ఆగిన తర్వాతనే దాటాలని కోరారు. అదేవిదంగా నిలకడ లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మండలంలోని పంటలు అన్ని పూర్తిగా పాడయ్యాయని,రైతులు చాలా నష్టపోయారని,కౌలు రైతుల పరిస్థితి ఇంకా దారుణమని అన్నారు.ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30000అందించాలని, కౌలు రైతులకు ఎకరాకు 50000 నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.