
Ashok Nagar
భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు.
పరవళ్ళు తొక్కుతున్న పాకాల సరస్సు,మాదన్నపేట చెరువు మత్తడి నీరు..
అశోక్ నగర్ వద్ద ఉగ్రరూపం దాల్చిన పాకాల వరదనీరు..
వట్టేవాగు వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మాదన్నపేట చెరువు అలుగు వరద*
కాకతీయ నగర్ కాలనీ వాసుల్లో మొదలైన ఆందోళన.
నర్సంపేట నుండి మాదన్నపేట,,నర్సంపేట నుండి పాకాల కొత్తగూడ రాకపోకలు బంద్.
ప్రమాదాలు జరుగకుండా పోలీస్ శాఖ అధికారులు బందోబస్తు..రెవెన్యూ మున్సిపల్ ,పంచాయితీ రాజ్ అధికారుల చర్యలు.
వరి పంటను దెబ్బతీస్తున్న భారీ వర్షాలు..
17,18 తేదీల్లో కురిసే భారీ వర్షాలతో రైతుల్లో అలజడి.
నర్సంపేట,నేటిధాత్రి:
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నర్సంపేట డివిజన్ పరిధిలోని సరస్సు,చెరువులు,కుంటులు మత్తల్లు పోస్తున్నాయి.ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు పాకాల గత రెండు రోజులుగా అలుగుపోస్తున్న ది.సరస్సులో 31 ఫీట్ల పైబడి వరదనీరు చేరడంతో ఓక ఫీట్ ఎత్తుగా మత్తడి పరవళ్ళు తొక్కుతున్నది.నర్సంపేట మాదన్నపేట చెరువు గత ఐదు రోజులుగా మత్తడి పోస్తూ నేడు వరద ఉదృతం పెరుగుతున్నది.శుక్రవారం అర్థరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి డివిజన్ పరిధిలోని చెరువులు,కుంటలు,వాగులు,వంకలు వరద నీటితో పారుతున్నాయి.నర్సంపేట నుండి పాకాల మీదుగా కొత్తగూడ వెళ్లే ప్రధాన రహదారిపై అశోక్ నగర్ వద్ద ఉన్న పాకాల నీటి ప్రవాహం తీవ్రస్థాయిలో పరవళ్ళు తొక్కుతుంది.
అటువైపు రాకపోకలు పూర్తిస్థాయిలో బంద్ అయ్యాయి.వాగువద్ద ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా ఖానాపూర్ పోలీస్ అధికారులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.మాదన్నపేట రోడ్డు వాగు వద్ద వరద నీటి ప్రవాహం ఉదృతం కావడంతో మున్సిపల్,పోలీస్ ,రెవెన్యూ శాఖల అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టారు.మాదన్నపేట చెరువు ఉగ్రరూపం దాల్చి మత్తడి పడితే చాలు..నర్సంపేట పట్టణంలో ఎన్టీఆర్ నగర్ కాలని వాసుల్లో గుబులు పుట్టిస్తోంది.నర్సంపేట నుండి నేక్కొండ వైపు ముగ్దుంపురం కాజ్ వే వద్ద వరద భీభత్సం పెరుగడంతో అటువైపు వెళ్లే వాహనాలను చెన్నారావుపేట పోలీసులు,అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.నల్లబెల్లి మండలం నుండి నందిగామ వైపు వెళ్లే ప్రధాన రహదారి లెంకాలపల్లి నందిగామ గ్రామాల మధ్య ఉన్న లో లెవర్ కాజ్ వే పై వరద నీటితో భయంకరంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ప్రమాదాలు జరుగకుండా నల్లబెల్లి ఎస్సై,రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో తగిన చర్యలు చేపట్టారు.దుగ్గొండి,నల్లబెల్లి,నర్సంపేట,ఖానాపూర్,చెన్నారావుపేట, నెక్కొండ మండలాల పరిధిలోని చెరువులు,కుంటలు నిండి మత్తళ్ళు పోస్తున్నాయి.దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.కొన్ని చోట్ల వాగుల వద్ద చేపలవేట చేస్తున్నారు.అనుకోకుండా ప్రమాదాలు
జరగవచ్చని అధికారులు హెచ్చరించినప్పటికి అవేవీ పట్టించుకోవడం లేదు.

17,18 తేదీల్లో కురిసే భారీ వర్షాలతో రైతుల్లో అలజడి.
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు డివిజన్ వ్యాప్తంగా చెరువులు,కుంటలు నిండు కుంటల్లా మారి శుక్రవారం అర్థరాత్రి కురిసిన భారీ వానకు అతలాకుతలం అయ్యింది.17,18 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో ఇప్పటికే చెరువులు,కుంటలు వాగులు నిండి భారీ ఎత్తున వరద భీభత్సం సృష్టించింది.ఐతే 17,18 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిస్తే పంటల పరిస్థితి ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వరి పంటను దెబ్బతీస్తున్న భారీ వర్షాలు..
*ఋతుపవనాలు ముందుగానే వచ్చినట్లు వచ్చి వెనక్కివెళ్లడంతో సుమారు 20 నుండి నెల రోజుల ఆలస్యంగా రైతులు వరినాట్లు సాగుచేసుకున్నారు.వరినాట్లు జోరందుకుంటున్న నేపథ్యంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు,కుంటలు నిండడం వరదలకు వరినాట్లు నీట మునుగడం,కొట్టుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి.మరిన్ని రోజులు వర్షాలు కురిస్తే పంటలకు నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్నాయని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీటి ప్రవాహం వద్ద పోలీస్ అధికారుల సేవలు భేష్..
*నర్సంపేట డివిజన్ పరిధిలోని కురుస్తున్న భారీ వర్షాలకు ప్రవహిస్తున్న వరద నీటి వద్ద ప్రమాదాలు జరుగకుండా రేయింబవళ్లు పహారా కాస్తున్న పోలీస్ అధికారుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈలాంటి సేవలు అందించడంలో నర్సంపేట డివిజన్ పోలీసులు ముందుంటారని ప్రజలు పేర్కొన్నారు.