
Heavy Rains Alert in Hyderabad
హైదరాబాద్‌పై మరోసారి వర్ష విరుపు కాబోతోంది.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం రానున్న గంటల్లో నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు మరో రెండు రోజులపాటు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జల్లులు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
నిన్న కురిసిన కుండపోత వర్షం ఇప్పటికే నగర వాసులను ఇబ్బందులకు గురిచేసింది. లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారిపోయాయి. రోడ్లు జలమయమై ట్రాఫిక్ కష్టాలు పెరిగాయి. ముఖ్యంగా కుత్బుల్లాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. నీరు నిలిచిపోయిన ప్రదేశాలను జీహెచ్ఎంసీ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పునరుద్ఘాటిస్తున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ఇప్పటికే పలు జిల్లాలకు ప్రభుత్వం అలర్ట్‌లు జారీ చేసింది.