
Heavy rain
ప్యాలవారం లో దంచికొట్టిన వాన
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని ప్యాలవారం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి, రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. నెలరోజుల తర్వాత కురిసిన వర్షానికి పంట చేనులో నీరు చేరడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా క్రమం తప్పకుండా కురుస్తున్న వర్షం పంటలను దెబ్బతీస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.