
Collector Rahul Sharma.
రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లాలో మంగళవారం సహా రాబోయే కొన్ని రోజులపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
వర్షాలు కొనసాగుతున్న సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తక్కువ ప్రదేశాలు, వంతెనలు, వాగులు, చెరువులు వంటి నీటిమునిగే ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. విద్యుత్ తీగలు, కరెంట్ స్తంభాల దగ్గరికి వెళ్లరాదని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని కలెక్టర్ వివరించారు. మండల, గ్రామ స్థాయి అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజల నుండి వచ్చే సమాచారం పై వెంటనే స్పందించాలని ఆయన ఆదేశించారు. సహాయక చర్యల కోసం తహసీల్దార్లు, ఎమర్జెన్సీ టీములు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వాతావరణ శాఖ ముందస్తు ఇస్తున్న సమాచారం ప్రకారం ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.