రహదారిపై దట్టమైన పొగమంచు, వాహనదారులకు ఇక్కట్లు
జహీరాబాద్ నేటి ధాత్రి:
శనివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని 65వ జాతీయ రహదారిని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీనివల్ల చిన్న, మధ్య తరహా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారిపై దృశ్యమానత తగ్గడంతో ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాల్సి వచ్చింది. నియోజకవర్గంలోని మొగుడంపల్లి నాల్కల్ కోహిర్ ఝరాసంగం మండలాలలో ఉదయం తొమ్మిది గంటల దాకా చల్లటి గాలి మంచు పడడంతో దగ్గు జ్వరం స్వశ విడిపోవడానికి ఇబ్బంది పడుతున్న చిన్న పిల్లలు పెద్దలు మంచు చలితో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు,
