
పారిశుద్ధ్య కార్మికులని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి ప్రధాన బాధ్యత-
మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం టౌన్.మునిసిపల్ కౌన్సిల్ హాలు నందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మరియు భద్రాద్రి జిల్లా కలెక్టర్.ప్రియాంక ఆలా మరియు కొత్తగూడెం శాశనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గార్ల ఆదేశానుసారం స్వచ్ఛత మిషన్ 2.O కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు అయిన. మదువరన్ శ్రీదుర్గా గార్లతో పాటుగా, లు రామకృష్ణ, సోంలా. రాంప్రసాద్ గారు,యశోదా గారు మరియు.ఏఎన్ఎం లు ఆశా వర్కర్లతో కూడిన వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులకు రక్తపోటు, మధుమేహం వ్యాధులకు సంబంధించిన పరీక్షలతో పాటుగా, వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు కావలసిన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పుర ప్రజలు ఆరోగ్యంగా ఉండగలరని, నిరంతరం మురికి కాలువలు, వ్యర్థాలు అధికంగా ఉండే ప్రదేశాలను వారి ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించేలాగా చర్యలు తీసుకుంటానని, అంతేకాకుండా ఇటీవల కాలంలో కొత్తగూడెం మునిసిపాలిటీ. పురపాలక శాఖ మాత్యులు కుట్ర కేటీఆర్ చేతుల మీదుగా శానిటేషన్ మరియు సాలీడ్ వెస్ట్ మ్యానేజ్మెంట్ విభాగంలో ప్రధమ బహుమతి గెలుచుకోవడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ప్రధానమైనదని వారి సేవలు మరువలేనివి అని పారిశుద్ధ్య కార్మికులను కొత్తగూడెం మునిసిపల్ కౌన్సిల్ ఎప్పటికి కుటుంబ సభ్యులవలే అక్కున చేర్చుకుంటు, వారి సమస్యలను పరిష్కరించబడంలో ముందు ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మేనేజర్ సత్యనారాయణ శానిటరీ ఇన్స్పెక్టర్లు అశోక్ చౌహాన్, వీరభద్ర చారి, జవాన్లు సలీం, వరప్రసాద్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.