ఆశా వర్కర్ల సమ్మెను స్పందించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.

> తెలంగాణలో తాత్కాలికంగా ఆశా వర్కర్ల సమ్మె వాయిదా.

> ఆశా వర్కర్ల 18 డిమాండ్లను కమిటీ వేసి పరిష్కరిస్తాం.

> హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని హెల్త్ డైరెక్టర్ హామీ ప్రకారం సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, మంగళవారం రోజు డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దీప్లా నాయక్ పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్స్ కు ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 25 నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేయడం జరిగింది. 15 రోజులు గడిచినప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించకపోవడంతో హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ ముందు వేలాది మందితో ధర్నా నిర్వహించాం. ఈ సందర్భంగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు , ఆశ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారు. ఆశల సమస్యలపై రూపొందించిన 18 డిమాండ్స్ ను డైరెక్టర్ కి వివరించడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్పందిస్తూ ఆశ వర్కర్ల కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి, సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీటితోపాటు పెండింగ్ పిఆర్సి, ఏరియర్స్, కరోనా రిస్క్ అలవెన్స్ ఇచ్చే విధంగా చూస్తామని సమ్మె కాలం వేతనాలు చెల్లిస్తామని ఇతర పెండింగ్ బిల్లులో కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా డైరెక్టర్ ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాలో ఆశ వర్కర్లు చేస్తున్న సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలియజేస్తున్నాం. అప్పటికి సమస్యలు పరిష్కరించకపోతే, రెండవ దఫా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాట కార్యక్రమాలు చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు దీప్లా నాయక్ అధికారులను కోరారు. జిల్లాలో బుధవారం రోజు నుండి ఆశా వర్కర్లందరూ విధుల్లో చేరుతున్నట్లు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ భాస్కర్ నాయక్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జిల్లాలో అధికారుల వేధింపులు, ఇతరత్రా ఇబ్బందులు పెట్టొద్దని, కక్ష సాధింపు చర్యలు చేయకూడదని, జిల్లా అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి చంద్రకాంత్, ఆశ జిల్లా కార్యదర్శి సాధన, యాదమ్మ, సావిత్రి, అలివేలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!