నానో యూరియా పర్యావరణాన్ని పరి రక్షిస్తుంది…
నేటి ధాత్రి -గార్ల :-
నానో యూరియా రసాయన ఎరువుల వాడకని తగ్గిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తుందని,నానో యూరియా వాడటం వలన పంట దిగుబడి పెరగడంతో పాటు రైతు ఆదాయం కూడా పెరుగుతుందని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు అన్నారు.మంగళవారం మండల మండల కేంద్రంలోని స్థానిక సొసైటీ కార్యాలయం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు నానో యూరియా గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నానో యూరియా వాడడం వలన పర్యావరణానికి హాని కలిగించే లీచింగ్ మరియు ఉద్గారాల ప్రమాదం తగ్గుతుందని, భూమి,గాలి మరియు నీటి కాలుష్యం తగ్గుతుందని తెలిపారు.
నానో యూరియా అనేది 20% నత్రజని కలిగి 85% కంటే ఎక్కువ వినియోగ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుందన్నారు.నానో యూరియా ద్రవ రూపం లో గల నత్రజని ఎరువు అని దీన్ని వాడటం వలన రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు.దీని కణాలు చిన్న పరిమాణం లో ఉండటం వలన పంటకు త్వరగా అందుతుందని అది శాఖీయ పెరుగుదలకు ధోహదం చేస్తుందని కిరణ జన్య సంయోగ క్రియ పెరగడం తో అధిక దిగుబడి వస్తుందని తెలిపారు.పర్యావరణానికి అనుకూలమైనదని,నేల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని అన్నారు.
గ్రీన్ హౌస్ వాయువుగా వాతావరణంలో కోల్పోయే నత్రజని శాతన్ని తగ్గిస్తుందని,ధాన్యపు పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు,కూరగాయలకు అధిక ప్రయోజనం ఉంటుందని అన్నారు.సూక్ష్మ పోషకాల సామర్థ్యం పెంచుతుందని, అనుకూల వాతావరణ పరిస్థితి లో సాధారణ యూరియా కంటే 90 శాతం ఎక్కువగా పనిచేస్తుందని, ఎలాంటి విషపూరీతం కాదని తెలిపారు.యూరియా అధికంగా వాడటం వలన చీడ పీడల ఉద్రుతి అధికంగా ఉంటుందని యూరియా బదులుగా నానో యూరియా ను వాడాలని సూచించారు.అన్ని పంటలలో వాడవచ్చునని వరి లో నాటు వేసిన 20-25 రోజులలో మరియు 45-50రోజులలో ఒకసారి అర లీటర్ వాడాలని అన్నారు.దీని వలన వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పదకత మరియు నాణ్యత మెరుగు పడుతుందని సూచించారు.రైతులు పంటల సాంకేతిక సలహాలు సూచనల కొరకు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని విచక్షణ రహితం గా రసాయన ఎరువులు వినియోగించకుండా సేంద్రియ ఎరువులను వాడాలని కోరారు.కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.