జమ్మికుంట మున్సిపాలిటీ 16వ వార్డులో ఆరోగ్య శిబిరం

జమ్మికుంట :నేటి ధాత్రి

జమ్మికుంట మున్సిపల్ ఏరియాలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఫర్హానుద్దున్ గారి ఆధ్వర్యంలో 16 వ వార్డులో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో 51 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగినది. నలుగురు జ్వర పీడితులకు ఆర్ డీ టి కిట్స్ ద్వారా డెంగీ మరియు మలేరియా వ్యాధులకు సంబందించిన పరీక్షలు నిర్వహించడం జరిగినది. అదేవిధంగా 29 వ వార్డులో డాక్టర్ చందన గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి 44 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగినది. ఇద్దరు జ్వర పీడితులకు ఆర్ డీ టి కిట్స్ ద్వారా మలేరియా మరియు డెంగీ పరీక్షలు చేయడం జరిగింది. ఈ రెండు వైద్య శిబిరములకు వచ్చిన ప్రజలకు అసంక్ర మిత వ్యాధులు మధుమేహం, రక్త పోటు పరీక్షలు నిర్వహించి, అవసరం ఉన్న వారికి తగిన మందులు ఇవ్వడం జరిగినది. సీజనల్ వ్యాధులు వ్యాపించు విధానం, వ్యాధుల లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను క్లుప్తంగా వివరించి చెప్పినారు. వ్యక్తి గత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పై అవగహన కల్పించనైనది. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ప్రతిఒక్కరు డ్రై డే పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమములో డాక్టర్ ఫర్హానుద్దీన్, డాక్టర్ చందన, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్ వైజర్స్ అరుణ, రత్న కుమారి, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, 16 వార్డ్ మరియు 29 వార్డ్ కౌన్సిలర్స్ ఉతాడి రాజయ్య, రావి కంటి రాజకుమార్ మరియు ANMS వాణిశ్రీ, రాధ, సజీదాపర్వీన మరియు ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *