Free Health Camp Successfully Conducted
హెల్త్ క్యాంప్ విజయవంతం ప్రజా పాలనలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం
కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్
పరకాల,నేటిధాత్రి
శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారం పరకాల పట్టణంలోని 19వ వార్డులో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మందులు పంపిణీ చేశారు.అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని 19వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంచిందని ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందించేందుకు కృషి చేస్తుందని,అందులో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి డాక్టర్ స్వాతి,డాక్టర్ వంశీ రెడ్డి,డాక్టర్ జ్యోతి రాజకుమార్,ఏఎన్ఎం రజిత, భాగ్యలక్ష్మి కల్పన భాగ్యలక్ష్మి ఆశ వర్కర్లు సౌందర్య, సుభద్ర,అంగన్వాడీ టీచర్లు విజయ, మల్లికాంబ,దుప్పటి రాజేష్, ఎండి షఫీ,వెల్తురు చిన్ని, నజీర్,రాహుల్,సురేష్, సాయి,సన్నీ తదితరులు పాల్గొన్నారు.
