భద్రాచలం నేటిదాత్రి
చర్ల మండలం గురువారం నాడు పులిగుండాల గ్రామంలో సోడి బాలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ పులిగుండాల గ్రామంలో ఐటీడీఏ నుండి నడుస్తున్న ప్రైమరీ స్కూల్లో ప్రధానోపాధ్యాయులను గతంలో సస్పెండ్ చేసిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మళ్లీ ప్రధాన ఉపాధ్యాయులను నియమించకుండా గాలికి వదిలేసారని ఆరోపించారు
మారుమూల ప్రాంతంలో నడుస్తున్న జిల్లా పరిషత్ మండల పరిషత్ ఐటీడీఏ స్కూల్ లలో ఉపాధ్యాయులు సమయానికి బడికి రాకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆదివాసి విద్యార్థులకు సరైన విద్యాబోధన అందడం లేదని విమర్శించారు లోన ఏరియాలో నడుస్తున్న స్కూళ్లపై ఐటిడిఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆదివాసి విద్యార్థులకు సరైన విద్యా బోధన అందే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో మల్లం విష్ణు మల్లం నాని బాబు కనితి సమ్మయ్య మల్లం జగపతి సోడి జగదీష్ మల్లం భద్రయ్య మల్లం తిరుపతమ్మ మల్లం భద్రమ్మ పాల్గొన్నారు.