
జమ్మికుంట: నేటిధాత్రి
జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో మృతిచెందగా యాప్ టీవీ అధినేత పాడి ఉదయానంద రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.మాజీ మార్కెట్ చైర్మన్గా పది సంవత్సరాల కాలం పాటు పనిచేసిన తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో ఆకాల మృత్యువాత పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న యాప్ టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తగా మంచి నాయకుడిగా గుర్తింపు పొందిన సమ్మిరెడ్డి మరణం ఆ పార్టీకి తీరని లోటని, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఉన్న సమయంలో రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తగిన చర్యలు తీసుకున్నాడని పేర్కొన్నారు. సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ధైర్యంగా ఉండాలని కోరారు.