గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ యాదగిరి మృతి

రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి.

గుండె పోటుతో హెడ్
కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మెదక్ పట్టణంలో శుక్రవారం జరిగింది. రామాయంపేట మండలం తోనిగండ్ల గ్రామానికి చెందిన యాదగిరి (53) మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. 1995 బ్యాచ్ కి చెందిన యాదగిరి గురువారం రాత్రి గుండె పోటు రావడంతో కుటుంబీకులు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి 8:50లకు నిమిషాలు తరలించారు. గుండె పోటు తీవ్రత దృష్ట్యా స్థానిక వైద్యులు హైదరాబాద్ సిఫార్సు చేశారు. చికిత్స కోసం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. యాదగిరి మృతితో కుటుంబం, డిపార్ట్మెంట్ లో విషాదం అలముకుంది. మృతుడి కుమార్తె విదేశాల్లో ఉండడం మూలంగా శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య సుజాత అలియాస్ లత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానిస్టేబుల్ యాదగిరి మృతి పట్ల జిల్లా పోలీస్ అధికారులు సంతాపం తెలిపారు. మెదక్ డిఎస్పి, పట్టణ, రూరల్ సిఐలు, పట్టణ ఎస్ ఐ లు పోచయ్య, రామ్ చందర్ నాయక్, ప్రతాప్, హెడ్ కానిస్టేబుల్లు, మహిళా కానిస్టేబుల్, పెద్ద ఎత్తున తరలివచ్చి మృతిచెందిన యాదగిరి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొందరు ఎస్సైలు కానిస్టేబుళ్లు వారితో పని చేసిన యాదగిరి మృతి చెందిన విషయాన్ని తట్టుకోలేక కన్నీరు పెట్టారు.తొనిగండ్ల గ్రామానికి చెందిన ప్రజలు తండోపతండాలుగా వచ్చి యాదగిరి ఇంటి వద్ద కన్నీరు మున్నూరు పెట్టారు. గత నెల 17వ తేదీన యాదగిరి తమ్ముడు రమేష్ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా,నెల రోజులకు యాదగిరి కి గుండెపోటు రావడం చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!