నియోజకవర్గ ప్రజలే నా బలం నా బలగం – బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ స్థాయిలో ప్రజలు హాజరయ్యారు. వెలిచాల గ్రామం రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. ఐఏఎస్ శిక్షణ తీసుకునే అధికారులు ఇక్కడకు వచ్చి పర్యటించి పోతారని అన్నారు. ఈసందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ ప్రాణం ఉన్నంతవరకు చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. ఈమట్టిలో పుట్టిన బిడ్డను ఈమట్టిలోనే కలిసిపోతానని అన్నారు. స్థానిక బిడ్డనైన నన్ను ఆశీర్వదిస్తే చొప్పదండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా. గతంలో స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. ఎన్నికల ముందు వచ్చి తర్వాత వెళ్లిపోయే నాయకులకు ఈప్రాంతం మీద మమకారం ఉండదు. పార్టీలకు అతీతంగా నేను అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నాని అన్నారు. మహానటి సావిత్రి, మహానటుడు కమలాసన్ వలె నటిస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను చూసి మోసపోవద్దు. అందరికీ అందుబాటులో ఉంటున్న, ఏఆపద వచ్చినా నేను అండగా నిలుస్తానని అన్నారు. అరవై ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కళ్యాణలక్ష్మీ ఎందుకు లేదు?
24గంటల కరెంటు ఎందుకు లేదు?
రైతు బంధు ఎందుకు లేదు?
రైతు బీమా ఎందుకు లేదు?
ఆసరా పెన్షన్లు ఎందుకు లేవు?
కాంగ్రెస్, బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ప్రపంచంలోనే అతి పెద్ద హనుమాన్ దేవాలయం కొండగట్టులో రూపుదిద్దబోతుంది. తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉంది. కాబట్టి కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలి. తెల్లరేషన్ కార్డున్న ప్రతి పేదింటికి కేసీఆర్ బీమా పథకం కింద ఐదు లక్షల బీమా ఇవ్వడం, ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామనడం, ప్రతి పేదింటి మహిళకు నాలుగు వందల రూ.లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఆసరా పెన్షన్లను ఐదు వేలకు, దివ్యాంగులకు ఆరు వేలకు పెంచడం జరుగుతుంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు పంటపెట్టుబడి సాయాన్ని పదహారు వేలకు పెంచడం జరుగుతుంది. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రైతులను, మహిళలను, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించడం కేసీఆర్ కార్యదక్షతను తెలియజేస్తుంది, బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిపి కలిగేటి కవిత లక్ష్మణ్, రాష్ట్ర నాయకులు వీర్ల వెంకటేశ్వరరావు, మాజీ జడ్పిటిసి వీర్ల కవిత, మండలాధ్యక్షులు జితేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.