
Jyothi Pandal Criticizes Congress Leadership in Zahirabad
కాంగ్రెస్ నాయకుల అసమర్థత గురించి ఘాటుగా విమర్శించిన
◆: – బీజేపీ సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ నాయకులు ఎంత అసమర్థులో మనందరికీ తెలిసిన విషయమే. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేదు, 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ నాయకులు గానీ వారి అనుచరులు గాని చాలా ఆకలి మీద ఉన్నారు, ఇప్పుడు అధికారంలో వచ్చాము కదా అని అహంకారపూరిత ధోరణితో ప్రవర్తిస్తూ ఆసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న నా స్టేట్మెంట్లో చెప్పిన విధంగా కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉండే అనుచరులు బిర్యాని ప్యాకెట్ల కోసమో బీరు కోసమో వాళ్ళ నాయకుల మీద ఉన్న ప్రేమని ఇతర మహిళల పైన నీచంగా మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ విషయాలని కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకువెళ్తే వాళ్లు 70 MM సినిమా చూస్తూ ఉంటారు తప్పితే వాళ్లు వాళ్ళ అనుచరులకి ఒక మాట కూడా ఏమనరు. పైగా వాళ్లకి చెప్పుకోవాల్సింది పోయి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కాపాడుతూ వస్తున్నారు మన జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అసమర్థత కాంగ్రెస్ నాయకులు. విషయం ఏమిటంటే ఈరోజు 9వ రోజు నిమజ్జనం జరుగుతున్న సందర్భంగా సార్వజనిక్ ఉత్సవ కమిటీ వాళ్ళు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులని పిలిచి వారిని సన్మానించడం జరుగుతుంది. కానీ సార్వజనిక్ కమిటీలో ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ నాయకులు వారి అనుచరులు కావున మహిళలందరూ కూడా సాయంత్రం ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నాము, మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ధోరణిలో ఉన్నారు ప్రస్తుతం, వాళ్లు మీ చీరలైనా లాగవచ్చు, మీ పైన చేతులైన వేయొచ్చు, మీ పైన నీచంగానైనా మాట్లాడవచ్చు, మీ గురించి ఇతరుల ముందు నీచంగా మాట్లాడవచ్చు, మీ ముందే నీచంగా మాట్లాడొచ్చు ఏదైనా జరగొచ్చు. కావున మహిళలందరూ కూడా జాగ్రత్త వహించాలి ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో మన రాష్ట్రంలో అమ్మాయిల పైన జరుగుతున్న అరాచకాలని చూస్తూ ఉన్నాం చూస్తూ వస్తున్నాం కూడా. చేతులు కాలిన తర్వాత ఆకులని పట్టుకుంటే లాభం లేదు ఎందుకంటే మన జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అంత అసమర్థులు కాబట్టి. పైన చెప్తున్న విషయాలకి ప్రత్యక్ష సాక్షిని నేనే కాబట్టి వాస్తవాలను మాట్లాడుతున్నాను, కావున మహిళలు కూడా ఈ విషయాన్ని గమనించాలి జాగ్రత్త వహించాలి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మహిళలకు భద్రత ఉండదని చాలా చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నష్టం జరిగిన తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు కాబట్టి, కావున మహిళలు ఇప్పటికైనా మేల్కొని కాంగ్రెస్ నాయకులు గానీ వారి అనుచరులతో గాని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఈరోజు సార్వజనిక్ ఉత్సవ కమిటీ వాలు కూడా మహిళల భద్రత కోసం షీ టీం మరియు మహిళా కానిస్టేబుల్స్ ని అక్కడ పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మహిళలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మన జహీరాబాద్ టౌన్ పోలీస్ శాఖ వారిని కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏ ఒక్క మహిళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగినా మేము అసలు ఊరుకునే పరిస్థితి ఉండదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.