వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
నేటిధాత్రి, వరంగల్ తూర్పు

వరంగల్ తూర్పు పరిధిలో 19, 20, 21వ డివిజన్లలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై మాట్లాడుతు తూర్పు ఎమ్మెల్యే ఎన్నికల్లో కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు నా జీవితం మొత్తం రుణపడి ఉంటాను. పార్టీకి కార్యకర్తలే పునాదుల లాంటి వారు, ప్రతి కార్యకర్తను కాపాడుకునే బాధ్యత నాది, బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్ములాంటి వాళ్లు, కార్యకర్తలు ఎవరు కూడా ఓడిపోయాము అని దిగులు చెందకుండా ధైర్యంగా ముందుకు నడువండి అని అన్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఎల్లవేళలా ప్రతి నిమిషం అందుబాటులో ఉంటాను అని, అంతేకాకుండా మీకు ఏ చిన్న ఆపద వచ్చిన తోడుగా ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఓని భాస్కర్, ఫుర్కాన్, 20వ డివిజన్ ఇంచార్జ్ మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, డివిజన్ అధ్యక్షులు ఉమెందేర్, అనిల్, ఇక్బాల్, బిఆర్ఎస్ నాయకులు చిర్ర అభిషేక్, బోట్ల స్వామి ముఖ్య నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
