పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల నుండి నార్లపూర్ వరకు వెళ్లే రోడ్డు మార్గంలో నూతన రోడ్డు మార్గం గురించి మరమ్మత్తులు చేపట్టి చాలా రోజులు గడుస్తున్నా మల్లక్కపేట హనుమాన్ దేవాలయం సమీపంలో మరియు గ్రామ బస్టాండ్ వద్ద మరమ్మత్తులు నిర్వహిస్తున్న సంబంధిత అధికారులు,కాంట్రాక్టర్ జరుగుతున్న స్థలంలో ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయలేదు.నిరంతరం వాహనాలు తిరిగే వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో రాత్రి సమయంలో వచ్చి వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది.ఈ సమస్య మీద వెంటనే స్పందించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేయాలనీ వాహనదారులు కోరుతున్నారు.