Old Calendar May Be Blocking Your Luck
క్యాలెండర్ ఇంకా తీసేయలేదా? మీ అదృష్టాన్ని మీరే అడ్డుకుంటున్నారు.!
మీ ఇంట్లో లేదా ఆఫీసులో ఇంకా 2025 నాటి పాత క్యాలెండర్ వేలాడుతూ ఉందా? అయితే.. ఇది మీకు తెలియకుండానే మీ పురోగతికి అడ్డంకిగా మారవచ్చని వాస్తు నిపుణులు అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మీ ఇంట్లో లేదా ఆఫీసులో ఇంకా 2025 నాటి పాత క్యాలెండర్ వేలాడుతూ ఉందా? అయితే.. ఇది మీకు తెలియకుండానే మీ జీవితంలో అడ్డంకులు సృష్టించే కారణం కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం, గతాన్ని పట్టుకుని ఉండటం అశుభమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పాత క్యాలెండర్లు మానసిక ప్రశాంతతను తగ్గించి, పురోగతికి ఆటంకం కలిగిస్తాయని అంటున్నారు.
హిందూ ధర్మంలో కాలాన్ని దేవుని రూపంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం కొత్త ఆశలు, కొత్త అవకాశాలను సూచిస్తుంది. పాత సంవత్సరం ముగిసిన తర్వాత కూడా ఆ క్యాలెండర్ను గోడపై ఉంచడం అంటే, మన మనసు ఇంకా గతంలోనే ఉండిపోయినట్టుగా భావిస్తారు. ఇది ఆధ్యాత్మికంగానూ, మానసికంగానూ ముందుకు సాగడంలో అడ్డంకి అవుతుందని అంటారు. పాత తేదీలు, గత జ్ఞాపకాలు ఇంట్లో ఉంటే.. ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయని, శక్తి ప్రవాహం మందగిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
