
mosquitoes
పారిశుద్ధ్యం పడకేసిందా…?
దోమలను నివారించే దిక్కే లేదు…?
పారిశుద్ధ్యం పై పట్టింపె లేదు
ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యమా
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ లోని కేసముద్రం విలేజ్ లో పారిశుద్ధ్యం పడకేస్తుందని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలే వర్షాకాలం దోమ కాటుతో ప్రతి ఇంట్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అంటే ఎంతో అభివృద్ధి పనులు జరుగుతాయని డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడుతుందని పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా జరుగుతాయని భావించామని కానీ గ్రామపంచాయతీ గా ఉన్న సమయంలో ఇంత నిర్లక్ష్యంగా పనులు జరగలేదని ప్రజలు మండిపడుతున్నారు. డ్రైనేజీల వెంట పిచ్చి మొక్కలు పొదలు పొదలుగా పేరుకు పోతున్న మున్సిపల్ అధికారుల తీరు ప్రత్యక్షంగా నిదర్శనమిస్తున్నాయని గ్రామంలోని ప్రజలు విమర్శిస్తున్నారు. దోమల నివారణ కోసం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు గ్రామాలలోని పారిశుద్ధ్యం పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని దోమల నివారణకు తగు చర్యలు చేపట్టాలని ప్రజల ఆరోగ్యం పట్ల ఒకింత శ్రద్ధ వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.