
Harihara Veeramallu
*ఘనవిజయం సాధించిన హరిహర వీరమల్లు..
•మిఠాయిలు పంచి పెట్టిన జనసేన నేతలు..
•అధికారంలో ఉన్నప్పుడే మీరు మా భీమ్లా నాయక్ ను ఆపలేకపోయారు,ఇప్పుడే మీ పీకుతారు..
*నగర అధ్యక్షుడు రాజారెడ్డి..
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 26:
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొని ఘనవిజయం సాధించిన శుభ సందర్భంగా తిరుపతిలో శనివారం జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి.
ఆ పార్టీ నేతలు బాబ్జి, సుమన్ బాబు, పగడాల మురళి, రాజేష్ ఆచారి, మనోజ్, రమేష్ నాయుడు, శ్రావణ్, జిన్నా భాష లలో కలిసి మీడియా సమావేశం నిర్వహించారుఒకరికొకరు మిఠాయిలను తినిపించుకుంటూ అందరికీ పంచిపెట్టారు. మా పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఘన విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారుఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ గతంలో వైయస్సార్సీపి అధికారంలో ఉన్నప్పుడే టికెట్ల రేట్లను 10, 5 రూపాయలకు తగ్గించి, అధికారులను ధియేటర్ల వద్ద పెట్టినప్పటికీ, మీరు మా భీమ్లా నాయక్ సినిమాను ఆపలేకపోయారు, మరి ఇప్పుడే మీ పీకుతారని ప్రశ్నించారు. హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కాట్ చేస్తున్నామంటూ.. సోషల్ మీడియాలో మా సినిమా గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ సునకానందం పొందుతున్న వారికి, ఈ సినిమాను వాడుకుని ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న వారికి, ప్రజలే బుద్ధి చెబుతూ హరిహర వీరమల్లు సినిమాను ఘనవిజయం చేశారన్నారు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలని, 24వ తేదీన వైసీపీ నేతలు కొందరు మమ్మల్ని టికెట్లు అడిగిమరీ సినిమా చూశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఘన విజయం సాధించి ఇప్పటికే అత్యధిక వసూళ్లను సాధించిందని, ఇంకా రానున్న వసూళ్లతో అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.