Hare Krishna Golden Temple
హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో నవంబర్ 14 – 19 వరకు వైభవంగా జరగనున్న 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు
హైదరాబాద్, నేటిధాత్రి:
హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, హైదరాబాద్లో ఏడవ వార్షిక శ్రీ బ్రహ్మోత్సవాలు నవంబర్ 14 నుంచి 19, 2025 వరకు ఘనంగా జరగనున్నాయి.
2018లో ఆరంభమైన స్వర్ణ దేవాలయంలో స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ శ్రీ రాధాగోవింద ప్రధాన విగ్రహాలుగా వెలసి నిత్యం పూజలు అందుకుంటున్నారు. వీరితో పాటు పాంచజన్యేశ్వర స్వామి, జలగర్భ శాలిగ్రామ శిల, శ్రీ జప ఆంజనేయ స్వామి మరియు ఆచార్య పరంపరా ప్రతిష్ఠించబడ్డాయి.
బ్రహ్మోత్సవం అనేది ఆలయ ప్రతిష్ఠ మరియు విగ్రహాల మహా సంప్రోక్షణను చేసుకునే వార్షిక వేడుక. స్వయంగా బ్రహ్మదేవుడే శ్రీమన్నారాయణునికి మొదటగా నిర్వహించిన ఈ ఉత్సవం పేరే బ్రహ్మోత్సవం. ఆధ్యాత్మిక సంప్రదాయంగా కొనసాగుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నింటిలోనూ ప్రతి సంవత్సరం నిర్వహించే ఆచారంగా జరపబడుతుంది. ఈ పవిత్ర సంప్రదాయాన్ని కొనసాగిస్తూ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రతి సంవత్సరం ఘనంగా శ్రీ బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తోంది.
ఈ ఏడాది ఉత్సవాలు నవంబర్ 14న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మూలవరు మరియు ఉత్సవమూర్తుల అభిషేకంతో ప్రారంభమవుతాయి. నవంబర్ 17 మరియు 19 తేదీల్లో శ్రీ భూసమేత నరసింహ స్వామి కళ్యాణోత్సవం, శ్రీ శ్రీ రాధాగోవింద దేవుల 108 కలశ మహాచూర్ణాభిషేకం మరియు మహాసంప్రోక్షణ వంటి ప్రధాన కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రతిరోజూ దేవతామూర్తులకు విశేషాలంకారాలు, పుష్పాలంకరణలు, నూతన వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి, హరినామ సంకీర్తనాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక ఉత్సాహంతో మార్మోగనుంది.
ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, బ్రహ్మోత్సవ ఆహ్వాన పోస్టర్ మరియు కార్యక్రమ వివరాలను హరేకృష్ణ మూవ్ మెంట్ , హైదరాబాద్ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ (ఎంటెక్, ఐఐటీ మద్రాస్) గారు విడుదల చేశారు.
ఉత్సవాలు మరియు వైభవమైన కార్యక్రమాలు.
నవంబర్ 14, శుక్రవారం
ఉదయం 5:15 – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మూలవర మరియు ఉత్సవర అభిషేకం
సాయంత్రం 6:30 – భూ వరాహ పూజ, వైనతేయ ప్రతిష్ఠ, అంకురార్పణ
నవంబర్ 15, శనివారం
ఉదయం 8:30 – ధ్వజారోహణం
ఉదయం 10:00 – ఉత్సవ హోమం
సాయంత్రం 5:00 – దేవత ఆవాహన
సాయంత్రం 6:00 – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఊంజల సేవ
నవంబర్ 16, ఆదివారం
ఉదయం 9:30 – మహా సుదర్శన హోమం
సాయంత్రం 6:00 – ఉత్సవ హోమం, హనుమద్ వాహన సేవ, శ్రీ రాధా గోవింద ఝూలన్ ఉత్సవం
నవంబర్ 17, సోమవారం
ఉదయం 9:30 – శ్రీ రాధా గోవింద మూలవర ప్రతిష్ఠ , ఉత్సవ హోమం
ఉదయం 11:30 – చప్పన్ భోగ్ సేవా
సాయంత్రం 6:00 – ఉత్సవ హోమం
సాయంత్రం 6:45 – కార్తీక సోమవారం, శ్రీ భూ సమేత నరసింహ స్వామి కల్యాణోత్సవం
నవంబర్ 18, మంగళవారం
ఉదయం 9:30 – ఉత్సవ హోమం
సాయంత్రం 6:00 – ఉత్సవ హోమం, గరుడ వాహన సేవ, శ్రీ రాధా గోవింద ఝూలన్ ఉత్సవం
నవంబర్ 19, బుధవారం
ఉదయం 8:30 – ఉత్సవ హోమం
ఉదయం 9:30 – మహా పూర్ణాహుతి
ఉదయం 10:30 – ఉత్సవార అభిషేకం & చక్ర స్నానం
సాయంత్రం 6:00 – దేవత ఉద్వాసనం & శ్రీ పుష్ప యాగం
సాయంత్రం 6:45 – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ రాధా గోవింద, శ్రీ నితాయి గౌరాంగ, శ్రీల ప్రభుపాదుల వారికి మహా చూర్ణాభిషేకం
రాత్రి 9:00 – మహా సంప్రోక్షణం
ఈ సందర్భంగా ప్రభూజీ మాట్లాడుతూ, “తెలంగాణ తొలి గోల్డెన్ టెంపుల్లో 7వ శ్రీ బ్రహ్మోత్సవాన్ని ఆరు రోజులపాటు భక్తి భావంతో జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాలు మన సంప్రదాయాన్ని, దైవారాధనను, కీర్తనలతో, సేవలతో, అర్చనలతో స్మరింపజేస్తాయి. అందరూ ఈ పవిత్ర ఉత్సవాల్లో పాల్గొని పరమాత్ముని దివ్య కృపను పొందాలని కోరుతున్నాము” అని అన్నారు. అన్ని కార్యక్రమాలు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా భక్తులు, యువకులు, సంఘ సభ్యులు పాల్గొననున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రసాద పంపిణీ, వసతి, రవాణా వంటి అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయబడ్డాయి.
ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు,
ప్రజా సంబంధాల అధికారి (PRO)
హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ – స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం,
హరే కృష్ణ మూవ్మెంట్ – హైదరాబాద్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్.
ఫోన్: 96400 86664 / 93964 16341 .
