
Teachers’ Day Celebrations in Kesmudram
ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు
సమాజంలో గురువుల పాత్ర అమూల్యమైనది… ఎంఈఓ కాలేరు యాదగిరి
కేసముద్రం/ నేటి ధాత్రి
మన దేశ రెండవ రాష్ట్రపతి మరియు గొప్ప విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని, విద్యారంగంలో ఉపాధ్యాయులు చేసే నిస్వార్థ సేవలను, అంకితభావాన్ని గౌరవించుకోవడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురువారం కేసముద్రం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో గౌడ సంఘం ఫంక్షన్ హాల్ లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేసముద్రం మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు అంకితభావం, కృషికి కృతజ్ఞతలు తెలియజేయడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం అని కొనియాడారు.ఉపాధ్యాయుల సేవలను గౌరవిస్తూ, విద్యార్థులకు జ్ఞానాన్ని పంచే గురువుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి అద్భుతమైన కృషికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అమూల్యమైనది. వారు అందించే మార్గదర్శకత్వం, బోధన, ప్రోత్సాహం విద్యార్థుల భవిష్యత్తును రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఉపాధ్యాయులు తమ జీవితాలను విద్యార్థుల అభివృద్ధికి అంకితం చేస్తారని అన్నారు. వారి అద్భుతమైన కృషిని స్మరించుకుంటూ, వారి పట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండలంలోని 21 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఉత్తమ ఉపాధ్యాయులు:-
1 బందెల రాజు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, కేసముద్రం స్టేషన్
2) బద్దెపురి అంజయ్య, స్కూల్ అసిస్టెంట్ పెనుగొండ హైస్కూల్
3) చీకటి వెంకట్రాం నర్సయ్య, స్కూల్ అసిస్టెంట్ కేసముద్రం విలేజ్ హైస్కూల్
4) గుంటి కుమార స్వామి, స్కూల్ అసిస్టెంట్ కేసముద్రం స్టేషన్
5) గుడిబోయిన గోపికృష్ణ, స్కూల్ అసిస్టెంట్ తాళ్ల పూసపల్లి హైస్కూల్
6) మాంకాలి యాకాంబరం, స్కూల్ అసిస్టెంట్ కల్వల హైస్కూల్
7) షేక్ మునీర్ అహ్మద్, ఎల్.ఎఫ్.ఎల్.హెచ్.ఎం. భవాని గడ్డ తండా
8) పోతుగంటి సరిత, ఎస్జీటీ ఎంపీయూపీఎస్ రంగాపురం
9) జె సువర్ణ, ఎస్జీటీ ఎంపీపీఎస్ మానసింగ్ తండా
10) జయ్యారపు స్వప్న, ఎస్జిటి ఎంపీపీఎస్ ఎస్టీ కాలనీ
11) తాళ్లపెల్లి రమేష్, ఎస్జీటీ ఎంపీపీఎస్ చైతన్య నగర్
12) కడుదుల శ్రీధర్, ఎస్జిటి ఎంపీపీఎస్ చంద్రు తండా, వెంకటగిరి
13) సింగారపు ఉపేందర్, ఎస్జీటీ ఎంపీపీఎస్ మాతృతండా
14) శివంగారి సురేందర్, ఎస్జీటీ ఎంపీపీఎస్ ముత్యాలమ్మ తండా, మహమూద్ పట్నం
15) నలబోల రేవతి, ఎస్జిటి ఎంపీపీఎస్ దన్నసరి
16) బానోత్ హరికిషన్, ఎంపీపీఎస్ కాట్రపల్లి
17) అయిత ప్రణీత, ఎంపీపీఎస్ కేసముద్రం స్టేషన్
18) సి.హెచ్ స్వరూప, ఎస్జీటీ ఎంపీపీఎస్ కల్వల
19) తమ్మె శ్రీనివాస్, ఎస్జిటి ఎంపీపీఎస్ క్యాంపు తండా
20) వెన్ను బిక్షపతి కంప్యూటర్ ఆపరేటర్, ఎం.ఆర్.సి కేసముద్రం
21) చీర మురళి, సిఆర్పి, ఉప్పరపల్లి కాంప్లెక్స్
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజు, కోట కనకయ్య, బండారు నరేందర్, కె చంద్రశేఖర్, వి రాజశేఖర్, మరియు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు గోపాల శ్రీధర్, బీరం జనార్ధన్ రెడ్డి, కీర్తి నాగయ్య, భద్రు నాయక్, గుండు సురేందర్, నరసింహ రాజు. భూక్య శ్రీను, వోమ సంతోష్, మండల రాజు, కె.శ్రీశైలం ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు