 
        జోగులాంబ డిఐజి. సిఎల్ ఎస్ చౌహన్
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

75 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగురవేసి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, సిబ్బందికి జోన్-7 జోగులాంబ డిఐజి శ్రీ ఎల్.ఎస్ చౌహాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద్భంగా డిఐజి మాట్లాడుతూ, దాదాపు 200 ఏళ్ల బ్రిటిషర్ల పాలన నుంచి భరతమాతకు 1947 ఆగస్టు15న విముక్తి లభించిందన్నారు. ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలుచేసి. తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించిన మహానీయులను, స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన గొప్ప వ్యక్తులను స్మరించుకుంటాం తెలిపారు.1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు. ప్రతి ఏడాది అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటామని మన అందరికీ తెలుసిన విషయమే. నిజానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు ఆగి జనవరి 26 తేదీన రాజ్యాంగాన్ని అమలు చేసే రోజుగా ఎంచుకున్నారు అని తెలిపారు.

 
         
         
        