పరకాల నేటిధాత్రి
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మండల ప్రజా పరిషత్ పరకాల కార్యాలయములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ సాధన కోసం వివాహం కూడా చేసుకోకుండా సర్వస్వం త్యాగం చేశారని తెలంగాణ అభివృద్ధి కొరకు అందరూ కష్టపడి పని చేయాలని అన్నారు తెలంగాణ అభివృద్దే ఆయనకు అసలైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకులు సి.హెచ్ శైలశ్రీ, ఏపిఓ ఇందిర,సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్, టెక్నికల్ అసిస్టెంట్లు నాగరాజు, సుమలత,టైపిస్ట్ మసూద్అలి, కార్యాలయ సిబ్బంది శ్రీకాంత్, అనిత తదితరులు పాల్గొన్నారు.