
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎర్రబెల్లి పున్నం చందర్ రావు
నేటి ధాత్రి
గడిచిన క్షణాన్ని స్మరిస్తూ..రాబోయే క్షణాన్ని ఊహిస్తూ..ఉదయించే ఉషస్సుల కోసం ఎదురుచూస్తూ నూతన సంవత్సరంలోకి అడివిడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎర్రబెల్లి పున్నం చందర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి సంబంధించి మొగుళ్లపల్లి మండల ప్రజలకు పలు సూచనలు చేశారు. మండలంలోని ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. అధిక మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని యువకులకు సూచించారు. సంతోషకరమైన రోజుని..విషాదకరంగా చేసుకోవద్దన్నారు. సంతోషకరంగా, సురక్షితంగా నూతన సంవత్సర వేడుకలను తమ తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి జరుపుకోవాలన్నారు.