రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలల్లో ర్యాలీ నిర్వహించి, పలు వీధులలో పర్యటించారు. ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు వనం సత్యనారాయణ మాట్లాడుతూ… 2015 ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి, భారత చేనేత లోగోను ఆవిష్కరించడంతోపాటు ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం గా ప్రకటిస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఎంతో నైపుణ్యంతో కూడిన వృత్తి చేనేత రంగమని ప్రస్తుత కాలంలో సరైన ఆదాయం లేక చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున రాయితులు కల్పించి చేయూత అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఆడెపు తిరుపతి, కోశాధికారి వేముల వెంకటేశం ఉపాధ్యక్షులు ఆడెపు కృష్ణ,మీడియా ఆర్గనైజింగ్ కార్యదర్శి పినుమల్ల గట్టయ్య, సాంబార్ వెంకటస్వామి, కొండ కుమార్, కార్యదర్శి వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.