
వైభవంగా మిలాద్ ఉన్ నబి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల సిద్దాపురం గ్రామంలో ముస్లిం సోదరులు మిలాద్-ఉన్-నబి పర్వదినాన్ని వైభవంగా జరుపుకున్నారు. ప్రముఖ మసీదుల్లో ప్రత్యేక నమాజ్‌లు చేశారు. ఇస్లాం మత స్థాపకుడైన మహ్మాద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పర్వదినాన్ని ముస్లింలు ఏటా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా మసీదుల్లో మహ్మాద్ ప్రవకర్త, ఆయన చేసిన త్యాగాలు, సేవలను ఇమామ్ ముస్లింలకు వివరించారు.
మహ్మాద్ ప్రవక్త బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఆయన బోధనలను ఈ పర్వదినాన ముస్లింలు ఆచరించారు గ్రామంలో ఉన్న భక్తులందరికీ అన్నదానా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కులమత విభేదాలు లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,