జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జిల్లా ప్రజలకు మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు శివాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో మహా శివరాత్రి పండుగను జరుపుకుంటారని జాగారం చేస్తారని చెప్పారు. పరమ శివుని ఆశీస్సులతో మన జిల్లా అభివృద్ధిలో రోల్ మోడల్ గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.