ఉప్పల్ నవంబర్ 23 నైటీ ధాత్రి
ప్రముఖ వ్యాపార వేత్త,లయన్ సురేష్ కుమార్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణంలో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లయన్ బొజ్జ రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్ధానిక లయన్స్ క్లబ్ సభ్యులతో పాటు కమలా నగర్ అసోసియేషన్ సభ్యులు, మరియు సంఘసేవకులు పలువురు వక్తలు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు చేస్తున్న సేవలను అభినందించారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి,లయన్స్ జిల్లా గవర్నర్ కట్టంగూర్ హరీష్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, ఇన్నా రెడ్డి కేసరి నరసింహా రెడ్డి,కార్పొరేటర్ శిరీష సోమశేఖర రెడ్డి,మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి, లయన్ ఏ వి ఆర్ దత్తు, నాగన్న, శ్రీనివాస్ రెడ్డి, మనోజ్ కుమార్ యాదవ్,రవికుమార్ యాదవ్,ఎం ఎన్ చారి, బూడిద జనార్ధన్, కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, సంఘసేవ కులు తదితరులు పాల్గొన్నారు.