సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
కామ్రేడ్ వినోద్ మిశ్రా 26వ వర్థంతి సభ ను భూపాలపల్లి రూరల్ మండలం గుడాడుపల్లి గ్రామంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ వినోద్ మేస్త్రి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యఅతిథిగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్.
హాజరైనారు అనంతరం మాట్లాడుతూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినొద్ మిశ్రా లిబరేషన్ పార్టీ ని రహస్యం నుండి బహిరంగంగా తీసుకుని వచ్చారు అని దీనిని విప్లవ రాజకీయ పార్టీ గా తీర్చిదిద్దారు అని అన్నారు.బీహర్ లో రెండు పార్లమెంటు,11 మంది ఎమ్మెల్యేలు లు ఒక ఎమ్మెల్సీ అలాగే జార్ఖండ్ రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్యేలు లతో గెలుపొందారని ఆయన అన్నారు
ఇంకా వినోద్ మిశ్రా చెప్పినట్లు చరిత్రలో సమస్యలన్నీ వీధుల్లోనే పరిష్కరించ బడతాయని ఫాసిస్టు లకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని దీనికి యువత నాయకత్వం వహించడానికి ముందుకు రావాలని ఆయన చెప్పారు అని అన్నారు. విప్లవం ఎర్ర పతాకాన్ని దృఢంగా చేపట్టి పటిష్టమైన కమ్యూనిస్టు పార్టీని గ్రామీణ పేదల శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్మించడం ద్వారానే కాషాయి శక్తులకు వ్యతిరేకంగా పోరాడగలుగుతావని ఆయన అన్నారు వినోద్ మిశ్రా చెప్పినట్లు మనం విప్లవ ఉద్యమాలు నడిపించడానికి అంకితం అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కన్నూరి డానియల్ సంగీరాజు పార్టీ కార్యకర్త లు బొచ్చు ప్రకాష్ కన్నూరి శంకర్ శ్రీనివాస్ సిద్దు పాల్గొన్నారు