
Indiramma's houses.
ఇందిరమ్మ ఇండ్ల తో నిరుపేదలకు సంతోషం
కొత్తగూడ, నేటిధాత్రి:
సొంత ఇల్లు లేక నిర్మించే పరిస్థితి లేక ఇన్నాళ్లు పూరిగుడిసెల జీవనం కొనసాగించిన పేద ప్రజలకు
కాంగ్రెస్ పార్టీ గెలుపు ఒక వరం
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదలకున్నది ప్రియతమ నాయకురాలు ధనసరి సీతక్కప్రత్యేక చొరవతో కొత్తగూడ మండలంలోని ఇందిరమ్మ ఇల్లు అధికంగా మంజూరు కావడం జరిగింది . అందులో భాగంగా నేడు కొత్తగూడ మండల కేంద్రం లో గాంధీనగర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరి పత్రాలు ఇవ్వడం జరిగినది
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మాట్లాడుతూ..
మా పూర్తి జీవితాలలో కూడా సొంత ఇల్లు కట్టుకుంటామని ఆశ లేకుండా బతుకుతున్న మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు సీతక్క గారి దయతో మా సొంతింటి కల నెరవేరబోతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా సొంత ఇంటి కలలు నిజం చేసిన స్థానిక మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని ఈ సందర్బంగా తెలిపారు…