
Jhansi Rajender Reddy's.
పాలకుర్తి నియోజకవర్గ నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించిన హనుమాండ్ల కుటుంబం
ఈ ప్రాంత అభివృద్దే ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి కుటుంబం సదాశయం
మరోసారి తమ చేతలతో నిరూపించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు
తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి
తొర్రూరు క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఒక హృద్యమైన కార్యక్రమం జరిగింది. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, హనుమాండ్ల ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్పర్సన్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, వారి కుటుంబం ఒక సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన 14 మంది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల విద్యా ఖర్చుల కోసం మొత్తం రూ.4,84,000 విలువైన చెక్కులను వారి కుటుంబాలకు అందజేశారు..
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు పాల్గొని విద్యార్థులకు చెక్కులు అందించారు. నిరుపేద విద్యార్థులు చదువు ఆపకుండా ముందుకు సాగాలని, తమ సపోర్ట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. విద్య మాత్రమే సమాజాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తుందని, వెనుకబడిన వర్గాలకు మద్దతుగా నిలవడం తమ కుటుంబం యొక్క ప్రధాన బాధ్యత అని ఝాన్సీ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.
తాము ఈ ప్రాంతానికి రుణపడి ఉన్నామని, ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తమకు శక్తినిస్తాయని ఆమె అభివర్ణించారు. నేను చేస్తున్నది దాతృత్వం కాదు, నా కుటుంబానికి చేస్తున్న బాధ్యత అని స్పష్టం చేశారు. రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా, ఒక తల్లి హృదయంతో సమాజంలోని పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా పాలకుర్తి నియోజకవర్గంలో విద్యా అభివృద్ధి పట్ల కుటుంబం ఎంత అంకితభావంతో ఉన్నామో తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు.. మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతీ విద్యార్తి చదువుకోవాలి, ఎవరూ ఆర్థిక సమస్యల వలన వెనుకబడి పోకూడదు. ఇందుకు కావాల్సిన సహాయం, ప్రోత్సాహం అందించడంలో మా కుటుంబం ఎప్పటికీ ముందుంటుంది. పాలకుర్తి అభివృద్ధి మా బాధ్యత మాత్రమే కాదు, మా జీవిత ధ్యేయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిరుపేద విద్యార్థులు, వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఇంత పెద్ద సహాయం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆగిపోతుందనే ఆందోళనలో ఉన్నామని, ఇప్పుడు కొత్త ఆశలు కలిగాయని వారు పేర్కొన్నారు. కొందరు తల్లిదండ్రులు కంటతడి పెట్టుకుంటూ తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇంతటి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ స్థాపన తర్వాత విద్యా రంగం, ఆరోగ్య రంగం, సామాజిక సేవా రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ ట్రస్ట్ చేస్తున్న కృషి పాలకుర్తి ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తోంది. గతంలోనూ పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించిన ఈ కుటుంబం, ఈసారి కూడా ఆర్థిక సాయం అందించడం విశేషం. విద్యా హక్కు ప్రతి పిల్లవాడికి లభించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్న ఝాన్సీ రాజేందర్ రెడ్డి కుటుంబం చర్యలు స్థానిక ప్రజల్లో విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి.
కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన పలు కాంగ్రెస్ నాయకులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సోమరాజశేఖర్ మాజీ కౌన్సిలర్ భూసాని రాము బసవ బోయిన రాజేష్ యాదవ్ హనుమండ్ల దేవేందర్ రెడ్డి చెర్లపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కటీ నాగిరెడ్డి కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొని, విద్యార్థులను అభినందిస్తూ, వారి భవిష్యత్తు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.