మల్లక్కపేట భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా హనుమాన్ జయంతి
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ఆలయ కమిటీ చైర్మన్ అంబీర్ మహేందర్
పరకాల,నేటిధాత్రి మండలంలోని మల్లక్కపేట గ్రామంలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకుల చేతులమీదుగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయ చైర్మన్ అంబీరు మహేందర్ మాట్లాడుతూ ఉదయం నుండి హనుమాన్ మందిరం లో భక్తులు అధికసంఖ్యలో హాజరై భజన సంకీర్తనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారని సాయంత్రం ఆలయం వద్ద బండ్లు తిరుగు కార్యక్రమం ఉన్నదని తెలిపారు.నియోజకవర్గ,పట్టణ మరియు మండలపరిధిలోని అన్నిగ్రామాల ప్రజలు సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని భక్తాంజనేయ స్వామి ఆలయ కమిటీ తరఫున భక్తులకు ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.