బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు నయీముద్దీన్
ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లు అందజేయాలని బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు నయీముద్దీన్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం రోజున ఆయన మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీ మైనారిటీల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని అన్నారు. మైనారిటీలకు లోన్లు కుట్టుమిషన్లను సైతం అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఏడాది నవంబర్ నెలలో ఎన్నికలు రావడంతో కుట్టుమిషన్ల పంపిణీ ఆగిపోయిందని, మైనార్టీ లోన్లు సైతం ఆగిపోయాయని వివరించారు. ముస్లిం మైనారిటీల పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ కు చిత్తశుద్ధి ఉంటే కుట్టుమిషన్ల పంపిణీ, రూ లక్షల రుణాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్దిదారులకు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఫ్జల్, ఇస్మాయిల్, ఖలీల్, షకీల్, తస్లిమాఖాన్, అబ్దుల్ ఖాన్, తౌసిఫ్ అహ్మద్ తదితరులు ఉన్నారు