లక్షెట్టిపేట్ (దండేపల్లి) ధర్మారావు పేట నేటిధాత్రి. :
గ్రామానికి చెందిన కళ్ళు కాంత అనే మహిళ గ్రామంలోని కిరాణా దుకానంకు సరుకుల కోసం వెళ్ళింది. అక్కడ తను వెంట తీసుకెళ్లిన మొబైల్ పోగొట్టుకొని విషయం దండేపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా ఎస్సైగారి ఆదేశాల మేరకు పోలీస్ కానిస్టేబుల్ కిరణ్ గ్రామంలోని సిసి కెమెరాల ఆధారంగా పోయిన ఫోన్ ను గంటల వ్యవధిలోనే పట్టుకొని స్టేషన్ కి తీసుకువచ్చి బాధితురాలికి అప్పగించడం జరిగింది. ఒక సిసి కెమెరా 100మంది పోలీసులతో సమానమన్న విషయం ప్రజలు గమనించాలని ప్రతి ఒక్కరు గ్రామాల్లో సిసి కెమెరాలను ఏర్పారు చేసుకోవాలని ఎస్సై గారు సూచించారు. దొంగతనాలు అరికట్టడంలో, దొంగలను పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతగానో ఉపయోగ పడతాయని ప్రజలు సిసి కెమెరాల ఏర్పాటుకు సహకరించాలి.